అవకాశాల కోసం సంబంధాలు పెట్టుకోను - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 09, 2013

అవకాశాల కోసం సంబంధాలు పెట్టుకోను

అవకాశాల కోసం సెక్స్ సంబంధాలు పెట్టుకోనని నటి సనాఖాన్ పేర్కొంది. ఈమె శింబుకు జంటగా శిలంబాట్టం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబిక్కు ఇంద ఊరు, అయిరం విళక్కు తదితర చిత్రాల్లో నటించినా హీరోయిన్‌గా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తాజాగా మాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఒరు నడిగైయిన్ డైరీ చిత్రంలో సిల్క్‌స్మితగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ పత్రికల వారితో ముచ్చటించింది.

ప్ర : సిల్క్‌స్మిత నటించిన చిత్రాలు చూశారా?
జ : ఆమె పాత్రలో నటించాలని నిర్ణయించుకున్న తరువాత సిల్క్‌స్మిత చిత్రాలను ఇంటర్నెట్‌లో వెతికి చూశాను. ఆమె బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు శ్రద్ధగా పరిశీలించాను.

ప్ర : సిల్క్‌స్మిత మరణంపై మీ అభిప్రాయం?
జ : సిల్క్‌స్మిత మరణంలో మర్మం ఉందని ఒక వర్గం, ఆత్మహత్య అని మరో వర్గం, సిల్క్‌స్మితది హత్యేనని మరో వర్గం వారు భావిస్తున్నారు. ఏదేమైనా ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

ప్ర : సిల్క్‌స్మిత నిజ జీవితంలోని సంఘటనలు మీకు ఎదురైతే ఏమిచేస్తారు?
జ : నేను చాలా ధైర్యవంతురాలిని. ఎవరిపైనా ఆధారపడను. ఎలాంటి మగవాడు నన్ను విరక్తికి గురి చేయలేదు. నిజం చెప్పాలంటే నా వల్ల వారు బాధపడితే తప్ప, నేను బాధితురాలిని కాబోను.

ప్ర : చిత్ర పరిశ్రమలో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటేనే అవకాశాలు రాబట్టుకోవడం సాధ్యమనే విషయం మీరు నటిస్తున్న చిత్రంలోనే ఉంది. దీనిపై మీ అభిప్రాయం?
జ : సెక్స్ సంబంధాలు పెట్టుకుంటేనే అవకాశాలు పొందగలమనే విషయాన్ని నేను విన్నాను. ఈ అంశం వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించింది. అలాంటి సంఘటన నా విషయంలో జరగలేదు. నాది ధృడమైన వ్యక్తిత్వం. ఎలాంటి పరిస్థితుల్లోనూ అవకాశాల కోసం సెక్స్ సంబంధాలు పెట్టుకోను.

ప్ర : సిల్క్‌స్మిత పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఆత్మ కలలోకొస్తే?
జ : ఒకవేళ అలా జరిగినా కచ్చితంగా సిల్క్‌స్మిత ఆత్మ నన్ను భయపెట్టదు. నా పాత్రలో చక్కగా నటిస్తున్నావు అని వ్యాఖ్యానిస్తుంది. నన్ను మళ్లీ ప్రేక్షకులకు గుర్తు చేస్తున్నావంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad