ట్రైలర్ మొత్తం వీక్షించినా ఇంకా కథను మాత్రం పజిల్ లాగానే ఉంచారు. ఒక ముసలామె ఆత్మ ఒక యువతిలోకి చేరడం అనే కాన్సెప్ట్ తో ఆమె ఎదుర్కొనే పరిస్థితులే కథనంగా ఈ సినిమాను రూపొందించారు. ఒక కొరియన్ సినిమా ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇవన్నీ తెలిసిన వార్తలే.
సినిమా ఆసాంతం అహ్లాదంగా ఉండబోతోందనే సంకేతాలను ఇస్తోంది 'ఓహ్ బేబీ' ట్రైలర్. సమంత ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో నాగశౌర్య అప్పీరియన్స్ ను ట్రైలర్ లో చూపించారు. రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
వృద్ధురాలి ఆత్మ యువతిలోకి ప్రవేశించడం, ఇరవైలలోని యువతి అరవైలలోని బామ్మలా ప్రవర్తించడం.. అందుకు సంబంధించిన సరదా సన్నివేశాలు ఉన్నట్టున్నాయి. అన్నింటికి మించి సమంత పెర్ఫర్మెన్సే ఈ సినిమాను కొత్త హైట్స్ కు తీసుకెళ్లినట్టుగా ఉంది!
No comments:
Post a Comment