టీడీపీ ఎంపీలు పోటీ చేయకపోవడానికి ఓటమి భయమే కారణమా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 03, 2019

టీడీపీ ఎంపీలు పోటీ చేయకపోవడానికి ఓటమి భయమే కారణమా?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎంపీలు భయపడుతున్నారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా అత్యధిక పార్లమెంటరీ నియోజకవర్గాలు, అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుండటంపై అధికార పార్టీ టీడీపీ తీవ్రంగా కలవరపడుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ తోట నరసింహం మరోసారి పోటీ చేయడానికి మొగ్గుచూపడం లేదు. అదేవిధంగా రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరూ పోటీ చేయడానికి అనారోగ్య కారణాలు చెబుతున్నా ఓటమి భయం వల్లే పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో తోట నరసింహం కేవలం 3 వేల మెజారిటీ మాత్రమే గెలుపొందారు. మురళీమోహన్ రాజమండ్రి నుంచి ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు.

చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అవినీతి తీవ్ర స్థాయిలో పేరుకుపోవడం, తూర్పుగోదావరిలో జనసేన, వైఎస్సార్సీపీ పార్టీల హవాను తట్టుకుని గెలుపొందే అవకాశం లేకపోవడం వంటి కారణాలతోనే మురళీమోహన్, తోట నరసింహం పోటీ చేయడానికి మొగ్గుచూపడం లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అయితే ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలకు ఆయువుపట్టు అయిన తూర్పుగోదావరిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి దారుణ ఫలితాలు తప్పేట్టు లేవు.

ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అంతగా బలం లేని అభ్యర్థులపైనే ఆధారపడుతోంది. కాకినాడ నుంచి ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ ను బరిలోకి దింపుతోంది. అదేవిధంగా అమలాపురం నుంచి దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ ను ప్రకటించింది. రాజమండ్రికి ఎవరిని దించాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad