తెలుగుదేశం పార్టీ తీరును చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడి చేతగాని తనాన్ని హైలెట్ చేస్తూ ఉన్నట్టుంది. ముఖ్యమంత్రిగా ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం ఇస్తే తను చెప్పిన పనులను చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు. ఈ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైలెట్ చేయడం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ.. తమ చేతగాని తనాన్ని హైలెట్ చేస్తూ ఉంది.
ప్రత్యేకించి రుణమాఫీ హామీ అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పుడు మాట్లాడుతున్న వైనాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతూ ఉంది. రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏయే హామీలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ హామీల్లో రుణమాఫీ హామీ కూడా ఒకటి.
తమకు అధికారం ఇస్తే రుణమాఫీని చేసి తీరతామంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా వారికి అవకాశం దక్కింది. అయితే ఆ ఆహామీ అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలం అయ్యింది. 'రైతు రుణమాఫీని చేసి చూపిస్తా..' అంటూ ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు.. 'రైతు రుణమాఫీని చేయండి..' అంటూ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నారు!
తాము చేస్తామని చెప్పి, అధికారాన్ని పొంది, ఐదేళ్ల పాలన అనంతరం, ప్రజల తిరస్కరించిన తర్వాత ఇప్పుడు రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా తన చేతగాని తనాన్ని, తను రుణమాఫీ చేయలేకపోయిన విషయాన్ని టీడీపీ అధినేతే ఒప్పుకుంటున్నాడు. రుణమాఫీని తాను చేయలేకపోయినట్టుగా, దాన్ని చేయాలని సీఎం జగన్ ను డిమాండ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు.
బహుశా ఇంత కన్నా నిస్సిగ్గు తనం ఉండదేమో. తెలుగుదేశం పార్టీ వాళ్లు అలా తమ చేతగానితనాన్ని తామే హైలెట్ చేసుకుంటూ ఉన్నారు.
No comments:
Post a Comment