రసకందాయకంగా తెలంగాణ ఎన్నికలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

రసకందాయకంగా తెలంగాణ ఎన్నికలు!


ముందస్తుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిదాయకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని స్పష్టం అవుతోంది. అయితే కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని తెలంగాణలోని తెరాస వ్యతిరేక రాజకీయ నేతలు ప్రకటించారు.

తెరాసకు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐలు కలిసి కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే ఈ కూటమికి తుదిరూపం ఇంకా ఏర్పడలేదు. సీట్ల విషయంలో ఈ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టం అవుతోంది. ఉన్న సీట్లలో ఎవరికి వారు ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. తమకు ముప్పై సీట్లు కావాలని తెలుగుదేశం అంటుంటే, తెలుగుదేశం కన్నా ఒక సీటు ఎక్కువే కావాలని టీజేఎస్ అంటోంది. ఇక కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లందరినీ మెప్పించి, ఒప్పించి మహా కూటమిని ఏ మేరకు ఏర్పాటు చేయగలదు? అనేది ప్రస్తుతానికి ఇంకా ప్రశ్నార్థకమే!

No comments:

Post a Comment

Post Bottom Ad