పోలీసులపై తెగబడుతున్న దొంగల ముఠా.. ఖాకీలపై ఎదురుకాల్పులు.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, April 04, 2015

పోలీసులపై తెగబడుతున్న దొంగల ముఠా.. ఖాకీలపై ఎదురుకాల్పులు..

తెలంగాణ రాష్ర్టంలో సూర్యాపేట బస్టాండ్ లో దొంగల ముఠా బస్సులో వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో జరిపిన సోదాల్లో దుండగలు పోలీసులపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో బస్టాండులో సోదాలు నిర్వహిస్తున్న సీఐ బృందంపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడే వున్న సిఐ, మరో హోంగార్డుపై బుల్లెట్ల వర్సం కురిపించి.. అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ర్ట పోలీసుశాఖ శనివారం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. దీంతో శనివారం ఉదయం నుంచి సినీఫక్కీని తలపించిన ఈ ఘటన రెండున్నర గంటల్లో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. సూర్యాపేట ఘటన తర్వాత పోలీసులు ముమ్మర తనిఖీలు జరపడంతో దుండగులు నల్గొండ జిల్లాను దాటి వెళ్లలేదు. ఈ ఉదయం 5:30 గంటలకు అర్వపల్లి మండలం సీతారాంపురం వద్ద ఇద్దరు వ్యక్తులు తుపాకీలతో జనగాం వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
దీంతో తుంగుతుర్తి సీఐ బాలగంగారెడ్డి, ఎమ్‌ఆత్మకూరు ఎస్సై సిద్ధయ్య, ఐదుగురు కానిస్టేబుళ్లతో అక్కడకు వెళ్లారు. పోలీసులను చూసిన వెంటనే ఇద్దరు దుండగులు పోలీసులపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల వద్ద ఐదు రౌండ్లకు సరిపడా బుల్లెట్లు మాత్రమే ఉండటంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినా దుండగులు తప్పించుకున్నారు. ఓ వ్యక్తిని బెదిరించి డిస్కవరీ బైక్‌పై దుండగులు పరారయ్యారు. బైక్‌పై నుంచి గాల్లోకి తుపాకీ చూపుతూ దుకాణ్‌బంద్‌ కరో, అందర్‌ చలేజావో అంటూ అరుస్తూ డి.కొత్తపల్లి వైపు వెళ్లిపోయారు. ఆపరేషన్‌ తీవ్రతరం చేసిన పోలీసులు భారీ బలగాలను మోహరించారు.
 
సరిహద్దు గ్రామాల్లో తీవ్రంగా గాలింపులు జరిపారు. కొత్తపల్లి తండాలో ఓ పెట్రోల్‌ బంక్‌లోకి చొరబడిన దుండగులు పెట్రోల్‌ పోయించుకుని వెళ్లినట్లు కనుగొన్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జానకీపురం-చిన్నకోడూరు మధ్య దుండగులు ఎదురుకావడంతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే హతమయ్యారు. ఇదే సమయంలో కానిస్టేబుల్‌ నాగరాజు బుల్లెట్‌ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.ఎమ్‌ ఆత్మకూరు ఎస్సై సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉండగా, రామయ్యపేట సీఐ బాలగంగిరెడ్డి గాయాలయ్యాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad