శివసేనతో చర్చలు జరుగుతున్నాయి : కిషన్ రెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 19, 2014

శివసేనతో చర్చలు జరుగుతున్నాయి : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు ప్రజలు చరమగీతం పలుకుతున్నారన్న విషయం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో నిరూపితమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల అంతులేని అవినీతి, కుంభకోణాలే ఆ పార్టీ కొంపముంచాయని చెప్పారు. మోడీ నాయకత్వంపై ప్రజలకు అంచంచలమైన విశ్వాసం ఉందని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని తెలిపారు. మోడీ నేతృత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో శివసేనతో చర్చలు జరుగుతున్నాయని... చర్చలు ఫలిస్తే పూర్తి మెజారిటీ సాధించినట్టవుతుందని చెప్పారు. హర్యానాలో 4 స్థానాల నుంచి అధికారం చేపట్టేంత వరకు ఎదిగామని చెప్పారు. ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీలో సైతం సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad