ఆగడు (రివ్యూ) = గబ్బర్ సింగ్+ దూకుడు+ బాద్షా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

ఆగడు (రివ్యూ) = గబ్బర్ సింగ్+ దూకుడు+ బాద్షా

maheshbabu-agadu
ప్రిన్స్ మహేశ్ బాబుతో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆగడు'పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. సినిమా చూసినవారిని 'విజన్ ఆంధ్ర' పలకరించగా.. రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఎక్కువ శాతం మంది ఫస్టాఫ్ అద్భుతమన్నారు. సెకండాఫ్ మాత్రం తేలిపోయిందని చెప్పారు. మొత్తం మీద యావరేజ్, ఎబౌ యావరేజ్ గా నిలిచే అవకాశాలున్నాయి. అది కూడా మహేశ్ మేనియా పనిచేస్తేనే. ఇక రివ్యూలోకి వెళ్తే..
శంకర్ (మహేశ్ బాబు) ఎవరూ లేని అనాథ. రాజారావు (రాజేంద్ర ప్రసాద్) అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీస్తాడు. అనుకోని సంఘటనలో చేయని నేరం తన మీద వేసుకుని జైలుకెళతాడు. ఇలా చిన్నతనంలోనే జైలు కెళ్లిన శంకర్ బాగా చదువుకుని ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అవుతాడు.  దామూ అలియాస్ దామోదర్ (సోను సూద్) అక్రమాలను అరికట్టేందుకు శంకర్ ను ఓ  గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. అక్కడ దామూ అక్రమాలను ఎలా ఎదిరించాడో తెలిపేది కత!  దూకుడు, పోకిరిలలో పోలీస్ ఆఫీసర్ గా అభిమానుల మనసు దోచుకున్న  మహేశ్ బాబు ఈ సినిమాలోనూ పోలీస్  ఆఫీసర్ పాత్రను పోషించారు. పంచ్ డైలాగ్ లతో మొదటి భాగాన్ని కిక్కెంచాడు. తమన్నాకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు. అయితే ఉన్నంతలో తన గ్లామర్ ను బాగానే ఒలికించింది. మరో నటి శృతి హాసన్ ఐటెం సాంగ్ లో మెరిసింది. మొదటి భాగంలో వేగంగా కదిలిన సినిమా.. రెండో భాగానికి వచ్చేటప్పటికే నీరసించింది. తలా తోకా లేని కథనం, బ్రహ్మానందం పేలవ కామెడీ, ఎంఎస్ నారాయణ, తనికెళ్ల భరణి సినిమాకు భారంగా మారారు. తమన్ సంగీతంలోని పాటలు వినడానికి బాగున్నా చూడటానికి రెండు బాగున్నాయి. 'ఆజా సరోజా', ఐటెం సాంగ్ అదరహో స్థాయిలో ఉన్నాయి. కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో పట్టున్న శ్రీను వైట్ల తన శైలిలో సినిమా తీశాడు. అయితే కథ లేకుండా పూర్తిగా మహేశ్ మేనియా మీద ఆధారపడటంతో సెకండాఫ్ నిరాశ పరుస్తుంది. కిచిడీ సినిమాల డైరెక్టర్ గా ముద్రపడ్డ శ్రీను వైట.. ఈసారైనా సినిమాలు తీసేటప్పుడు తన గత సినిమాలను చొప్పించకపోవడమే మంచిది. మొత్తం మీద మహేశ్ మేనియాతో ఆగడు భారీ కలెక్షన్లు రాబట్టుకోవచ్చు.




No comments:

Post a Comment

Post Bottom Ad