మగాళ్లు ఈ సెక్సిణికి చేసిన అన్యాయమేంటో కానీ అందరినీ పందులు అని అంటోంది. వివరాల్లో కెళితే హాలీవుడ్ శృంగార తార, ప్రఖ్యాత మోడల్ కెల్లీ బ్రూక్‌కు మగాళ్ల పట్ల విపరీతమైన కోపం వచ్చేసింది. అందుకే మగమహారాజులపై నోరుపారేసుకుంది. ఇంతకీ అమ్ముడుకి ఇంత కోపం రావడానికి కారణమైన వారు మరెవరో కాదు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్స్ బిల్లీ జేన్, జాసన్ స్టాటమ్. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కెల్లీ బ్రూక్ తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ జేన్, స్టాటమ్ మరియు బ్రిటిష్ రగ్బీ స్టార్ డానీ సిప్రియానిలతో చేసిన రొమాన్స్ గురించి చెప్పుకొచ్చింది. మాజీ బాయ్ ఫ్రెండ్ జాసన్ స్టాటమ్ గురించి కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ...‘డానీ విషయం ముగిసిన తర్వాత లాస్ట్ ఇయర్...జాసన్ నాకు ఫోన్ చేసాడు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. నేను కూడా ప్రేమిస్తున్నట్లు చెప్పాను. మేము ఎప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉంటాము. అయితే తర్వాతి రోజు వార్తల్లో.... అతను రోసీతో బ్రేకప్ చేసుకున్నట్లు విన్నాను. అప్పుడు అర్థమైంది అతను నాకు ఎందుకు కాల్ చేసాడో. మగాళ్లు పందుల్లాంటి వారు...అలానే ఉంటారని అర్థం చేసుకున్నాను. జాసన్ మళ్లీ రోసీతో మళ్లి కలిసి ఉంటున్నాడు. మళ్లీ అతని నుండి కాల్ రాలేదు' అని తెలిపింది. బిల్లీ జేన్ గురించి కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ....‘అతను నన్ను 1960 బాండ్ గర్ల్‌లా లేదా 1950 హౌస్ వైఫ్‌లా చూడాలని కోరుకునే వాడు. నా లుక్ గురించి అతను ఎలా నిర్ణయిస్తాడు. నా ఇష్టమైనట్లు నేను ఉంటాను. అతని అభిప్రాయాలు నాపై రుద్దే ప్రయత్నం చేసాడు. అందుకే అతనితో నాకు కుదరలేదు.' అని చెప్పుకొచ్చింది. ఓర్నీ నీ తస్సారాల బొడ్డు నీకు నచ్చినవారితో నువ్వు తిరగొచ్చు.. మగాళ్లకు మాత్రం 'ఆ' అవకాశం లేదంటే ఎలా అమ్మడూ..
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment