నేటి నుంచి క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, July 18, 2014

నేటి నుంచి క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. చట్టసభల్లో ఎలా వుండాలి. సభా సంప్రదాయాలు సభ్యుడు ఎలా పాటించాలనే అంశాలపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రాండ్ కాకతీయ హోటల్ లో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.  శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాగత ఉపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రం ఆర్థిక మంత్రి అరుణ్ -జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad