ఏపిలో ఎంసెట్ విధానం రద్దు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, July 25, 2014

ఏపిలో ఎంసెట్ విధానం రద్దు

హైదరాబాద్;ఎంసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక నుంచి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీ సర్కార్ అనుకుంటుంది. తమిళనాడులో అమలులో ఉన్న ఈ విధానంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించనుంది. ఈ కమిటీ త్వరలో తమిళనాడు వెళ్లనుంది. ప్రస్తుతం ఎంసెట్ విధానం ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయింపు జరుగుతోంది. ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది

No comments:

Post a Comment

Post Bottom Ad