తెలంగాణకు 9,893 ఉద్యోగులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 01, 2014

తెలంగాణకు 9,893 ఉద్యోగులు


 హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాల్సిన ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా గవర్నర్ నరసింహన్ పేరుతో శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలోను, రాజధానిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో, అసెంబ్లీ, శాసన మండలిల్లో పనిచేయాల్సిన 9,893 మంది ఉద్యోగుల పేర్లతో సహా కేంద్ర శిబ్బంది, శిక్షణ విభాగం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తెలంగాణ సచివాలయంలో 1,164 మంది, రాజధానిలోని తెలంగాణ శాఖాధిపతుల కార్యాలయాల్లో 8,601మంది, తెలంగాణ శాసనసభ, శాసన మండలిల్లో 128మంది ఉద్యోగులు పనిచేయాలని నిర్దేశించింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ రోజైన సోమవారం నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఉద్యోగులందరూ పనిచేయాల్సిందే. ఎవరైనా పనిచేయడానికి ఇష్టపడకపోతే వారికి జీతం రాదు. కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆయా ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.. సోమవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధుల్లో చేరుతూ రిపోర్ట్ చేయాలి. ఇక జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పని చేసే రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీని ఇప్పుడు చేపట్టడం లేదు. ప్రస్తుతానికి వారందరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పనిచేయాలి. వారి పంపిణీ చేపట్టే వరకు ఏ జిల్లాల్లో, ఏ జోన్‌లో పనిచేస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వారికి వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపులో వీలైనంత వరకు ఏ ప్రాం తానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే పంపిణీ చేశారు..రాష్ట్ర వ్యాప్తంగా 76,000మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగ కాలం కూడా జూన్ నెలాఖరుతో ముగుస్తోంది. వీరి కొనసాగింపుపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad