జూ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నాడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, May 01, 2014

జూ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నాడు!


హీరో జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్దిరోజుల్లో తండ్రి కాబోతున్నాడు. ఈ  విషయం ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు స్పష్టమైంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వచ్చారు. చాలాకాలంగా మీడియాకు కనిపించకుండా దూరంగా ఉన్న లక్ష్మీ ప్రణతి.. ఎన్నికల పేరుతోనే సుదీర్ఘ కాలం తర్వాత బయట  కనిపించింది. ఇటీవల బీవీయస్‌యన్ ప్రసాద్ కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ వేడుకలో లక్ష్మీప్రణతిని చూసినవారు ఆమె గర్భవతేమో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఏడు నెలల గర్భవతి అని సమాచారం. 2011లో ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతిల వివాహం జరిగింది. ఇటీవలే మరో హీరో అల్లు అర్జున్ కూడా తండ్రి అయిన విషయం తెలిసిందే. బన్నీ సతీమణి స్నేహ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకి అయాన్ అనే పేరు పెట్టారు.

No comments:

Post a Comment

Post Bottom Ad