విధిలేకే పీఆర్పీ విలీనం: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, April 01, 2014

విధిలేకే పీఆర్పీ విలీనం: పవన్

prp-merge-pawan-comments

అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీనంపై తాజాగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ స్పందించారు. కాంగ్రెస్ను హటావో అంటూనే అన్నయ్యను వెనుకేసుకొస్తున్న పవన్ మరో సారి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2009 నాటి ఎన్నికల తర్వాత వైఎస్సార్‌ పిలుపుతో చాలామంది పార్టీ విడిచివెళ్లిపోదామని సిద్ధమైపోయారు. ఒక్కడున్నా పార్టీని నడిపే స్థెర్యం అవసరం. వాళ్లను కూర్చోబెట్టి ఎన్ని సిద్ధాంతాలు, ఆశయాలు చెప్పినా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అన్నయ్య మీద బరువు పెట్టేసేవారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో కలిపేశారు అని అన్నయ్య అంతరంగా పవన్ వివరించారు. అయితే పార్టీ అన్నాక ఇబ్బందులు వస్తాయి... ఓడిపోతాం... నష్టాలు, కష్టాలు వస్తాయి. వాటిని తట్టుకొని ఉంటే పీఆర్పీ నేడు ప్రత్యామ్నాయ శక్తి అయ్యేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad