శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, April 24, 2014

శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం!

YSRCP politician, Aallagadda Assembly contestent Shobha Nagi Reddy met with road accident on wednesday at 11pm near Nandyal and badly injured. First she was taken to Nandyal Hospital. and admitted in ICU.  After that she was shifted to Hyderabad Care Hospital for better treatment. Her present situation was very bad. After participation in YSR Janabheri meeting held at Nandyal along with YS Sharmila she was going to her home at Allagadda. Mean time the accident was held. she got badly injured. Driver Nagendra, Gunmen Srinivas, Basha also injured seriously.

వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం వైఎస్ షర్మిలతో పాటు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్న శోభా నాగిరెడ్డి అనంతరం ఆళ్లగడ్డలోని తమ నివాసానికి తిరిగి వెళ్తుండగా  ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేయడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది.
డోర్ ఓపెన్ కావడంతో ముందు సీట్లో కూర్చున్న శోభా నాగిరెడ్డి వాహనం నుంచి ఎగిరి మళ్లీ వాహనంపై పడ్డారు. దీంతో ఆమె తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని, అందుకు తప్పనిసరిగా హైదరాబాద్ తరలించాల్సిందేనని అక్కడి వైద్యులు తెలపడంతో బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆమెతోపాటు కారు డ్రైవర్ నాగేంద్ర, గన్ మెన్ శ్రీనివాస్, బాషాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad