అభ్యర్థుల వేటలో 'ఆప్' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 18, 2014

అభ్యర్థుల వేటలో 'ఆప్'

ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ఆయన సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో  కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై కుమార్విశ్వాస్ పోటీకి దిగుతారని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రత్యర్థిని వెతికే పనిలో తలమునకలైంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలైన షాజియా ఇల్మిని కాంగ్రెస్  అధ్యక్షురాలిపై పోటీకి నిలిపేందుకు పథక రచన చేస్తోంది. ఇల్మి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆర్కేపురం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లేదా ఫరూఖాబాద్ నుంచి కేంద్ర మంత్రి  సల్మాన్ ఖుర్షీద్పై పోటీకి ఆమె ఆసక్తి చూపారు. అయితే ఆ స్థానం నుంచి ముఖుల్ త్రిపాఠిని అభ్యర్థిగా పార్టీ నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. దాంతో సోనియాపై ఇల్మిని బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది. ఢిల్లీలో పార్టీకి భారీ  మద్దతుదారులున్నందున సోనియాలాంటి బలమైన ప్రత్యర్థిపై కాస్త పేరున్న వ్యక్తులనే పోటీకి దించాలనే ఉద్దేశంతో షాజియా పేరును ఆప్ పరిశీలిస్తుందని అర్థమవుతోంది. అలాగే భాజపా ప్రధాని అభ్యర్థి మోడీకీ దీటైన అభ్యర్థిగా ఆప్ కన్వీనర్  కేజ్రీవాలే ప్రత్యర్థిగా నిలబడతారన్న ప్రచారమూ వినిపిస్తోంది. అయితే గుజరాత్ బయట ఎక్కడినుంచైనా మోడీ బరిలోకి దిగితేనే ఈ నిర్ణయం తీసుకోవాలనీ భావిస్తోంది. భాజపా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అంజలీ  దమానియా పోటీకి సై అంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad