సభలు పెట్టి రెచ్చగొడుతుంది సీమాంధ్ర ప్రజలేనని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ వారు శనివారం శాసనసభ ప్రాంగణంలో దీక్ష చేపట్టేందుకు వచ్చారు. అయితే అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉన్నాయని.... అసెంబ్లీ నుంచి కేవలం అభిప్రాయాన్ని మాత్రమే కోరతామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ బుల్లెట్ బైక్ పై వచ్చారు. ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎదుట భారీగా తెలంగాణవాదులు మోహరించారు. అసెంబ్లీ-లక్డీకాపూల్ రహదారిలో నిరసన నిర్వహించారు.
Post Top Ad
Sunday, September 08, 2013

సభలు పెట్టి రెచ్చగొడుతున్నారు!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment