'అంతకు ముందు, ఆతరువాత' సినిమా రివ్యూ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 06, 2013

'అంతకు ముందు, ఆతరువాత' సినిమా రివ్యూ


ఇప్పుడొస్తున్న అన్ని ప్రేమకథలూ ఒకేలా ఉంటున్నాయనేది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడి ఫిర్యాదు. అందులో వాస్తవం కూడా ఉంది. అందమైన అమ్మాయి, అబ్బాయి... తొలి చూపులో ప్రేమ... కులమో, మతమో, డబ్బో ఇలా ఏదో ఒక అవాంతరం రావడం... చివరకు కథ సుఖాంతం కావడం. ఈ నేపథ్యానికి రకరకాల మసాలాలు అద్దడం. ఫైనల్‌గా ప్రొడక్ట్ ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణలాంటి సెన్సిబుల్ దర్శకుడు ఓ ప్రేమకథ తీస్తున్నాడంటే, ఇలాంటి మసాలాలే ఉంటాయా? అదే జరిగుంటే, అసలు మనం ఈ సినిమా గురించే మాట్లాడుకోనవసరం లేదు.

ముందు ఈ సినిమా కథ గురించి చెప్పుకుందాం. 23 ఏళ్ల కుర్రాడు ఓ ఫంక్షన్‌లో అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. తను కూడా ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. కానీ ఏవో కన్‌ఫ్యూజన్లు. ఈ ప్రేమ జీవితాంతం ఇంతే ఫ్రెష్‌గా, క్వాలిటీగా ఉంటుందా? ప్రేమలో ఉండగా రంగు రంగుల సీతా కోకచిలుకలా ఉండే జీవితం పెళ్లి కాగానే గొంగళిపురుగులా కనిపిస్తుందా? అని రకరకాల సందేహాలు. దీనికి పరిష్కారం ఏంటి? అబ్బాయికో ఐడియా వస్తుంది. ఇద్దరం రెండు నెలల పాటు భార్యాభర్తలుగా సహజీవనం చేద్దామంటాడు. ఆ అమ్మాయి భయపడుతూ, ఇబ్బందిపడుతూనే ఓకే అంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ప్రణయం. సెకండాఫ్ ఏమో సహజీవనం. ఫైనల్‌గా ఈ జంట ఏం తెలుసుకున్నారు? ఏం తేల్చుకున్నారన్నదే మిగిలిన కథ.

వినగానే రెగ్యులర్ స్టోరీ కాదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ రెండు నెలల సహజీవనం కాన్సెప్ట్ అంటేనే, మన థాట్స్ ఎటెటో వెళ్లిపోవడం, బోలెడంత రొమాన్స్‌ని ఆశించడం సహజం. కానీ ఇంద్రగంటి ఈ కథను డీల్ చేసిన విధానం ఎక్స్‌లెంట్. మనలో చాలామందిమి రొమాన్స్‌కి, సెక్స్‌కి తేడా ఎప్పుడో మర్చిపోయాం. రొమాన్స్ అంటే సెక్స్ అన్నట్టుగా కొన్ని సినిమాలు డెఫినిషన్ చెప్పేశాయి. కానీ ఇంద్రగంటి రొమాన్స్‌కి, సెక్స్‌కీ మధ్య ఉండే సున్నితమైన లేయర్‌ని టచ్ చేశాడు. ఇంతటి గంభీరమైన, సంప్రదాయ విరుద్ధమైన కథాంశాన్ని చాలా హోమ్లీగా, లవ్లీగా, సెన్సిబుల్‌గా, క్లీన్‌గా చూపించాడు. నిజం చెప్పాలంటే ఇది లవ్‌స్టోరీ కాదు. లైఫ్ స్టోరీ. ప్రేమ అనే వస్తువుని తీసుకుని జీవితాన్ని స్వచ్ఛంగా ఆవిష్కరించాడు. జీవితం ఒక సినిమా అనుకుంటే, దానికి ప్రత్యేకంగా ట్రయిలర్స్ ఏమీ ఉండవు. ముఖ్యంగా లైఫ్ సినిమాకి లవ్ అనేది ట్రయిలరే కాదని స్పష్టంగా చెప్పారు. అలాంటి అనుమానాలు, పొరపాట్లు, సర్దుబాట్ల గురించి ఇంద్రగంటి సున్నితంగా చర్చ లేవనెత్తారు. అయితే తను ఎక్కడా క్లాసులు పీకుతున్న ధోరణిలో లేకుండా ఓ లైవ్లీగానే ఈ సినిమాని ఆవిష్కరించారు. ప్రేమకథలో ఫ్యామిలీ ఎమో షన్స్‌నీ, డ్రామానీ అందంగా సమ్మిళితం చేయడంతో సినిమాకో డెప్త్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్, హీరోతో కలిసి 2 నెలలు వేరే ఫ్లాట్‌లో ఉంటుంది. ఆ రెండు నెలలు ఇంట్లో చెప్పకుండా ఎలా మేనేజ్ చేసిందనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే హీరో బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ వ్యవహారాలు... అంత ఇంపాక్టివ్‌గా అనిపించవు. ఇలాంటి చిన్న చిన్నవి మినహా ఓవరాల్‌గా సినిమా ఓకే.

 హీరోగా సుమంత్ అశ్విన్‌కిది రెండో సినిమా. ఎక్కడా జర్కుల్లేకుండా చాలా ఈజ్‌తో అనిల్ పాత్రలో అందంగా ఇమిడిపోయాడు. తనకు మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమా నిరూపించింది. ఇక హీరోయిన్ ఇషా ఆ పాత్రకు టైలర్‌మేడ్‌లా అనిపించింది. మనకో తెలుగు కథానాయిక దొరికినందుకు ఆనందపడాలి. తండ్రి పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌కు ఆల్టర్‌నేట్‌గా రావు రమేష్ స్థిరపడిపోయినట్టే. అంత గొప్పగా ఇందులో యాక్ట్ చేశారు. రోహిణి, రవిబాబు, ఝాన్సీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలాకాలం తర్వాత కనిపించిన మధుబాల మాత్రం నిరాశపరుస్తారు. సెపరేట్ కామెడీ ట్రాక్స్ లేకపోయినా, అవసరాల శ్రీనివాస్ పాత్రే పెద్ద రిలీఫ్ ఇస్తుంది. కళ్యాణి కోడూరి రీరికార్డింగ్, పీజీ విందా ఫొటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్స్. డైలాగ్స్ బాగా స్కోర్ చేస్తాయి. ఈ సినిమా విషయంలో నిర్మాత దామోదర ప్రసాద్ టేస్ట్‌ని మెచ్చుకోవాలి.

హైలైట్స్: హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫ్రెష్‌నెస్, డైలాగ్స్, నేచురల్ రొమాంటిక్ సీన్స్

డ్రాబ్యాక్స్: ద్వితీయార్థంలో స్లో నేరేషన్, కొన్ని బలహీన సన్నివేశాలు

బాటమ్ లైన్: సినిమా చూసిన తర్వాత కూడా... కూల్

No comments:

Post a Comment

Post Bottom Ad