పబ్జీ గేమ్ పై నిషేధం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, January 23, 2019

పబ్జీ గేమ్ పై నిషేధం!


పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది పబ్‌జీ గేమ్‌ బానిసలవుతున్నారు. ఒక్కసారి ఆడితే చాలు అది అడిక్షన్గా మారిపోతుంది. గంటల కొద్దీ ఈ గేమ్‌ ఆడడం ఆరోగ్యానికి సైతం ప్రమాదంగా మారనుంది. ఇక విద్యార్థులు తమ చదువుల్లో వెనుకబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం పబ్‌జి గేమ్‌ నియంత్రణకై చర్యలు చేపట్టింది. ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు పబ్‌జి గేమ్‌ ఆడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. ఈ గేమ్‌ను దేశవ్యాప్తంగా నిషేధించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad