యువనటుడు ఉదయ్ కిరణ్ మద్యం మత్తులో శుక్రవారం అర్ధరాత్రి హల్‌చల్ చేశాడు. స్నేహితురాలితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ రికార్డులను ధ్వంసం చేశాడు. ఆపై సిబ్బందిపై దాడికి యత్నించడంతో వీరిద్దరిపై పీడీ చట్టం ప్రయోగించనున్నామని మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 కేసులు, కాకినాడలో 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2016లో పీడీ యాక్ట్ నమోదై ఏడాది పాటు జైల్లో ఉన్నా ఉదయ్ కిరణ్ ప్రవర్తనలో మార్పు రాలేదని డీసీపీ తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ పరారే, యువరాజ్యం, ఫేస్‌బుక్, రాక్షసులు సినిమాల్లో నటించాడు.

No comments:
Post a Comment