బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ కు ప్రపంచ్యవాప్తంగా అభిమానులున్నారు. పెళ్లయి, ఒక కుమార్తె ఉన్న ఐశ్వర్య వయసు ఎప్పుడో నాలుగు పదులు దాటింది. అయినా ఈ సుందరి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా హాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో ఒకరైన విల్ స్మిత్.. ఐశ్వర్యారాయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన సమ్మిట్ కు హాజరైన విల్ స్మిత్.. తాను చనిపోయేలోగా ఐశ్వర్యా రాయ్ తో కలసి నటించాలని ఉందని అన్నాడు. అంతేకాకుండా ఆమెతో కలిసి ఒక పాటలో నృత్యం చేయాలని ఉందని తన తీరని కోరికను వెల్లడించాడు. ఐశ్వర్యను తాను 15 ఏళ్ల కిందటే కలిశానని, ఆమెతో సినిమాల గురించి చాలా చర్చించానని వివరించాడు. కాగా, ఐశ్వర్య గతంలో కొన్ని హాలీవుడ్ మూవీస్లోనూ నటించిన విషయం తెలసిందే.

No comments:
Post a Comment