పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు పొగడ్తల వర్షం కురపిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ విరాట్ బ్యాటింగ్లో ఏదో శక్తి దాగి ఉందని ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. దానితో పాటు ఓ టార్గెట్కూడా పెట్టేశాడు. ‘గువాహటి, విశాఖపట్నం, పుణె వేదికల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి కోహ్లిలో ఏదో ప్రత్యేక ఉంది. అతనో అద్భుత పరుగుల యంత్రం. ఈ ఘనత అందుకున్న తొలి భారత క్రికెటర్ కోహ్లి. ఇలానే 120 సెంచరీలు సాధించాలి. ఇది నేను కోహ్లికి నిర్ధేశించిన టార్గెట్’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానం ఉన్నాడు. ఇప్పటికే కోహ్లీ 62 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment