ఓటుకు నోటు కేసులో మత్తయ్య అప్రూవర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

ఓటుకు నోటు కేసులో మత్తయ్య అప్రూవర్!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసు విషయం చాలా రోజుల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అయిన జెరుసలెం మత్తయ్య తాను అప్రూవర్ గా మారతానని చెబుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇంతకాలం ఈయన తెలుగు దేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆయనను టీడీపీ పెద్దలు జాగ్రత్తగా చూసుకుంటారని సమాచారం. అయితే ఇప్పుడు ఏమైందో కానీ మత్తయ్య సడన్ గా అప్రూవర్ గా మారతానంటున్నారు. తనకు బెదరింపు కాల్స్ వస్తున్నాయని హత్య చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆయన వాపోతున్నారు. తాను
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ని క్రిస్టియన్ సమస్యల మీద చర్చించేందుకే కలిశానని, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనైతిక చర్యలకు పాల్పడ్డాయి. వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకోవాలని తనను హత్య చేసేందుకు రెండు ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. 'కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సహకరించింది. కానీ ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో నాకు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. అందుకే నేను పార్టీ ఇన్ పర్సన్ గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశాను. నాకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు చెబుతాను. ఓటుకు నోటు కేసుతో పాటు ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. రెండు కేసుల్లోని రహస్యాలను సీబీఐ వెలికితీయాలని' మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకు విజ్ఞప్తి చేశారు. అయితే ఓటుకు నోటు కేసుతోపాటు ఫోన్ ట్యాపింగ్ను కూడా కేసులోకి లాగడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad