స్మార్ట్ సిటీ మిషన్ జాబితాలో అమరావతి, కరీంనగర్లకు చోటు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, June 24, 2017

స్మార్ట్ సిటీ మిషన్ జాబితాలో అమరావతి, కరీంనగర్లకు చోటు

Amaravati & Karimnagar in Smart Cities Mission list

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లకు స్మార్ట్ సిటీలో చోటు కల్పిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు వెల్లడించారు. కొత్తగా మరో 30 నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి రెండు నగరాలకు చోటు దక్కడం గమనార్హం. ఇదిలాఉండగా తమిళనాడు నుంచి 4, కేరళ 1, యూపీ 3, కర్ణాటక 1, గుజరాత్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2 నగరాలు స్మార్ట్ సిటీ జాబితాలో ఎంపికయ్యాయి. దీంతో ఇప్పటివరకూ 90 నగరాలు స్మార్ట్‌సిటీ మిషన్‌ కిందకు చేరాయి. తిరువనంతపురం, నయా రాయ్‌పూర్‌, రాజ్‌కోట్‌, అమరావతి, పట్నా, కరీంనగర్‌, ముజఫర్‌నగర్‌, పుదుచ్చేరీ, గాంధీనగర్‌, శ్రీనగర్‌, సాగర్‌, కర్నల్‌, సత్నా, బెంగళూరు,సిమ్లా, డెహ్రాడూన్‌, తిరుప్పూర్‌,పింప్రీ చించ్వద్‌, బిలాస్‌పూర్‌, పాశిఘాట్‌, జమ్ము, దాహోద్‌, తిరునెల్వేలి, తూతుకుడి, తిరుచురాపల్లి, ఝాన్సీ, ఐజల్‌, అలహాబాద్‌, అలిగఢ్‌, గ్యాంగ్‌టక్‌‌లను స్మార్ట్ జాబితాలో స్థానం పొందాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad