ఆంధ్రాకు వస్తున్న సంస్థలివే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 27, 2014

ఆంధ్రాకు వస్తున్న సంస్థలివే..

new-education-institutes-in-andhra
రాష్ర్ట విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలేవీ లేని నేపథ్యంలో.. వివిధ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. రానున్న రోజుల్లో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందే హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనుకున్న నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ), ఇండియన్ కలినరీ ఇన్సిట్యూట్లను విజయవాడ, తిరుపతిలలో ఏర్పాటు చేస్తారు. మరోవైపు రాష్ర్ట ప్రభుత్వం గుంటూరులో అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి మన విద్యార్థులు ఎక్కడికి వెళ్లకుండానే సొంతరాష్ర్టంలోనే ఇంజనీరింగ్, ఎంబీఏ, డిజైనింగ్, సైన్స్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ వంటి కోర్సులను చదువుకోవడానికి వీలు కలుగుతుంది. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లోనూ యూనివర్సిటీలు ఉన్నాయి. వివరాలు
శ్రీకాకుళం - డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ
విజయనగరం - కోరుకొండ సైనిక్ స్కూల్
విశాఖపట్నం - ఆంధ్రా యూనివర్సిటీ, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ
తూర్పుగోదావరి - ఆదికవి నన్నయ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ
పశ్చిమగోదావరి - హార్టికల్చరల్ యూనివర్సిటీ
కృష్ణా - కృష్ణా యూనివర్సిటీ, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్
గుంటూరు- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, విజ్ఞాన్స్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ.
నెల్లూరు - విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ.
చిత్తూరు - పద్మావతి విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, రాష్ర్టీయ సంస్కృత పీఠ్, వేదిక్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కలికిరి సైనిక్ స్కూల్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ
కర్నూలు - రాయలసీమ యూనివర్సిటీ
కడప - యోగి వేమన యూనివర్సిటీ
అనంతపురం - జేఎన్టీయూ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ

No comments:

Post a Comment

Post Bottom Ad