మలేషియా విమానాన్ని ఎత్తుకెళ్లిన గ్రహాంతర వాసులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 16, 2014

మలేషియా విమానాన్ని ఎత్తుకెళ్లిన గ్రహాంతర వాసులు!

ఇంతవరకు ఆచూకీ లేకుండా పోయిన మలేషియా విమానాన్ని ఏలియన్స్.. అదేనండి గ్రహాంతర వాసులు ఎత్తుకెళ్లారంట! లేకపోతే దాదాపు 10 దేశాల విమానాలు, హెలికాఫ్టర్లు, నౌకలు గాలిస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించకపోవడం ఏంటని కొంతమంది ప్రశిస్తున్నారు. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసుల పనేనని కొందరు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు! అమెరికా, రష్యా దేశాల్లో చాలామంది ఇంతకుముందు చాలాసార్లు ఎగిరే పళ్లాల్లో మరుగుజ్జులాంటి వ్యక్తులను చూశామని చెప్పడం తెలిసిందే. భూమికి దూరంగా ఉన్న గ్రహాల్లో గ్రహాంతర వాసులు నివసిస్తున్నారని చాలామంది నమ్ముతున్నారు. గ్రహాంతరవాసుల నేపథ్యంలోనే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అవతార్ మూవీని తెరకెక్కించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad