సెక్సువల్ గా వేధించారు.. కాంగ్రెస్ పై సంచలన ఆరోపణ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, April 19, 2019

సెక్సువల్ గా వేధించారు.. కాంగ్రెస్ పై సంచలన ఆరోపణ


-ఎవరీ  ప్రియాంక చతుర్వేది ఏమిటామె కథ?

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక చతుర్వేది రాజీనామా సంచలనం రేపుతూ ఉంది. ఆమె చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే శివసేనలోకి చేరిన ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ పార్టీలో తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించారు. తనను ఆ పార్టీలో కొందరు లైంగికంగా వేధించారని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తను కోరినా
రాహుల్ గాంధీ పట్టించుకోలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించడం సంచలనంగా మారింది. పార్టీలో ఒక డైనమిక్  లీడర్ గా పేరు పొందిన ఒక మహిళా నేత నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనమే. ఆమె రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది.


ప్రియాంక చతుర్వేది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకండానే వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. పార్టీ యూత్ వింగ్ లీడర్ గా వ్యవహరించారమె. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ పార్టీ పార్టీ తరఫున స్పోక్ పర్సన్ గా జాతీయ మీడియా ద్వారా ప్రాచూర్యం పొందారు.

డీఎన్ఏ, ఫస్ట్ పోస్ట్, తెహల్కా వంటి మీడియా సంస్థల్లో ఆమె రచయితగా వ్యవహరించారు. వివిధ సామాజిక అంశాలపై వ్యాసాలు రాశారామె. అలాంటి గుర్తింపుతో కాంగ్రెస్ లో ఎదిగారు. రెండు వేల పదహారులో ఒక మీడియా సంస్థ 'ఎదుగుతున్న టాప్ టెన్  మహిళా రాజకీయ వేత్తలు' అనే జాబితాను ఎంపిక చేయగా..అందులో కూడా ఆమె స్థానం సంపాదించారు.

అలా తనకంటూ  ఒక ప్రత్యేక గుర్తింపును  కలిగిన ఆమె రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఆమె మరీ గొప్ప ప్రజానేత కాకపోయినా.. ఆమె రాజీనామా మాత్రం  కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతోంది. ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఉద్ధవ్  ఠాక్రే ఆధ్వర్యంలో శివసేనలోకి చేరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad