ప్రత్తిపాడులో గెలిచేది ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 16, 2019

ప్రత్తిపాడులో గెలిచేది ఎవరు?

ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
నియోజకవర్గంలో ఉన్న మండలాలు: గుంటూరు మండలం (మున్సిపల్‌ కార్పొరేషన్‌ మినహాయించి), వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలు.

గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఒకటి.. ప్రత్తిపాడు. 2004 వరకు జనరల్‌ కేటగిరీలో ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది.  ఇప్పటివరకు 13సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, కాంగ్రెస్‌ (ఐ) ఐదుసార్లు, టీడీపీ ఆరుసార్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. ఆయన 1983, 85, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్సార్‌ హవాలో కాంగ్రెస్‌ అభ్యర్థి రావి వెంకటరమణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మేకతోటి సుచరిత.. టీడీపీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచారు. తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి 2012 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు.  కాగా, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన రావెల కిశోర్‌ బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సుచరితపై 7,405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రావెలకు 96,274 ఓట్లు రాగా, సుచరితకు 88,869 ఓట్లు లభించాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. గుంటూరు ఎంపీగా విజయం సాధించిన గల్లా జయదేవ్‌కు ప్రత్తిపాడులో 9,382 ఓట్ల మెజారిటీ లభించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనసేన పార్టీ తరఫున రావెల్‌ కిశోర్‌బాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మేకతోటి సుచరిత పోటీ చేయనున్నారు.


No comments:

Post a Comment

Post Bottom Ad