డేటింగ్ లో ఉన్నానని ధ్రువీకరించిన హాట్ భామ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 03, 2019

డేటింగ్ లో ఉన్నానని ధ్రువీకరించిన హాట్ భామ

బాలీవుడ్ వివాదాల భామ కంగన రనౌత్ గురించి తెలియనివారు లేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే కంగన రనౌత్ తాను డేటింగ్ లో ఉన్నానని సంచలన ప్రకటన చేసింది. తాజాగా ఒక సినీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించింది. అయితే డేటింగ్ చేస్తున్నానని చెప్పిన కంగన ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలపలేదు. అయితే అతను సినీ పరిశ్రమకు సంబంధించినవాడేనని బాలీవుడ్ భావిస్తోంది.

కంగన ఆ ఇంటర్వ్యూలో తనకూ ఎన్నో కోరికలున్నాయని, వాటికి అతీతంగా తాను జీవించలేనని, ప్రేమ లేకుండా ఉండటం తన వల్ల కాదని చెప్పింది. గతంలో ప్రేమ కారణంగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని, చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అంతమాత్రం చేత ఇప్పుడు జీవితంలో ప్రేమ, ఒక మగాడి స్పర్శ లేకుండా బతకలేనని హాట్ కామెంట్స్ చేసింది.

గతంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో పీకల్లోతు ప్రేమ వ్యవహారాలు నడిపిన కంగన ఆ తర్వాత హృతిక్ పై బహిరంగంగా నిప్పులు చెరిగింది. అంతేస్థాయిలో కంగనపై హృతిక్ కూడా స్పందించాడు. కంగన క్యారెక్టర్ లెస్ గర్ల్ అని దుమ్మెత్తిపోశాడు. ఆమెనెప్పుడూ తాను ప్రేమించలేదని, ఆమే తనను ప్రేమించానంటూ వందల కొద్దీ ఈమెయిల్స్ తనకు పంపిందని వాటిని బయటపెట్టాడు. ఒకరికొకరు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. కంగన వ్యవహారం వల్లే హృతిక్ భార్య సుసానే అతడికి విడాకులిచ్చిందని వార్తలు దావానలంలా వ్యాపించాయి.


No comments:

Post a Comment

Post Bottom Ad