గుంటూరు జిల్లాలో సీట్లన్నీ కమ్మోళ్లకేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 12, 2019

గుంటూరు జిల్లాలో సీట్లన్నీ కమ్మోళ్లకేనా?

తెలుగుదేశం పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన గుంటూరు జిల్లాలో అత్యధిక సీట్లన్నీ తమ సామాజికవర్గం.. కమ్మ నేతలకే కట్టబెట్టింది. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో మూడు (ప్రత్తిపాడు, వేమూరు, తాడికొండ) ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు. ఇక మిగిలిన 14లో 11 స్థానాలు (తెనాలి, నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ, గురజాల, మంగళగిరి, పొన్నూరు, చిలకలూరిపేట) కమ్మ సామాజికవర్గానికే కట్టబెట్టింది. దీనిపై పార్టీలోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి.

తెనాలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నరసరావుపేట నుంచి రావెల సత్యం, మాచర్ల నుంచి ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, వినుకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గురజాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ రావు, పెదకూరపాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, పొన్నూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు పశ్చిమ నుంచి కోవెలమూడి రవీంద్రబాబు లేదా ఎన్ఆర్ఐ మన్నవ మోహన్ కృష్ణ, మంగళగిరి నుంచి ఒక ఎన్ఆర్ఐకి దాదాపు సీట్లు ఖాయమయ్యాయి.

రేపల్లె నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, గౌడ సామాజికవర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ కు సీటు కేటాయించగా, బాపట్ల నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన అన్నం సతీశ్ ప్రభాకర్ (కాపు) లేదా అనంతవర్మ (క్షత్రియ) లేదా వేరే వ్యక్తిని రంగంలోకి దించనుంది. గుంటూరు తూర్పు నుంచి ఒక ముస్లిం అభ్యర్థికి సీటు కేటాయించే ఆలోచనలో ఉన్నారు. ఇలా గుంటూరు జిల్లాలో మొత్తం పది మంది కమ్మ సామాజికవర్గం నేతలు బరిలోకి దిగనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad