f2 50 రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 02, 2019

f2 50 రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందంటే..


ప్రముఖ రచయిత, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీ బ్యూటీ తమన్నా, వర్థమాన తార మెహ్రీన్ ఫిర్జాదీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఎఫ్2 ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సంకాంత్రికి విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో రూపొంది దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించింది.

తాజాగా ఈ చిత్రంలో మరో మైలురాయిని చేరుకుంది. 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. విడుదలైన సినిమా 25 రోజులు కూడా ఆడటం గగనమైపోతున్న ఈ రోజుల్లో ఎఫ్2 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోవడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ', 'కథానాయకుడు' పరాజయం పాలై టాలీవుడ్ నిరాశలో కూరుకుపోయిన నేపథ్యంలో ఎఫ్2 మంచి విజయం సాధించి టాలీవుడ్ లో జోష్ నింపింది.

అంతేకాకుండా అటు కథానాయకులు విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, ఇటు హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ కెరీర్ లో ఎఫ్2 అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' పెద్ద హిట్ గా ఉంది. అదేవిధంగా వరుణ్ తేజ్ కెరీర్ లో 'ఫిదా' పెద్ద హిట్ గా ఉంది. ఇప్పుడు ఈ హీరోలిద్దరూ వంద కోట్ల క్లబ్ లో ప్రవేశించారు. వీరిద్దరికీ ఇంతకుముందు వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు లేవు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఫిదా, ఎఫ్2 మూడింటికీ దిల్ రాజే ప్రొడ్యూసర్ కావడం మరో విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad