ఈసారైనా సునీల్ గెలుస్తాడా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 02, 2019

ఈసారైనా సునీల్ గెలుస్తాడా?

ఇప్పటికే కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన చలమలశెట్టి సునీల్.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంటనే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన సునీల్ గతంలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున, వైఎస్సార్సీపీ తరఫున కాకినాడ ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

2009లో 34044 మెజారిటీతో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పళ్లంరాజుపై, 2014లో 3,431 మెజారిటీతో టీడీపీ నేత తోట నరసింహంపై ఓడిపోయారు. రెండుసార్లు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన సునీల్ ఈసారి జనసేన పార్టీలో చేరతారని అనుకున్నప్పటికీ ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. అయితే జనసేన పార్టీ అత్యంత బలంగా ఉన్న కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో సునీల్ గెలవడం కష్టసాధ్యమే.

ప్రస్తుతం కాకినాడ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీగా తోట నరసింహం ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఈసారి పోటీకి మొగ్గుచూపడం లేదు. తన బదులుగా తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే దీనికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు. జగ్గంపేట ఎమ్మెల్యేగా ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కాలంలో టీడీపీలోకి ఫిరాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ జ్యోతులకే టికెట్ దక్కే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad