200 మంది యువతులపై అత్యాచారం, న్యూడ్ వీడియోలు.. ఎక్కడంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 12, 2019

200 మంది యువతులపై అత్యాచారం, న్యూడ్ వీడియోలు.. ఎక్కడంటే..

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఒక ముఠా దారుణ అకృత్యాలకు తెగబడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది కళాశాలల యువతులపై అత్యాచారాలకు పాల్పడింది. ఫేస్ బుక్, వాట్సాప్ తదితరాల ద్వారా ప్రేమ పేరుతో కళాశాల యువతులతో పరిచయాలు పెంచుకున్న ఆ ముఠాలోని వ్యక్తి ఆ తర్వాత తన ముఠాలోని సభ్యులతో కలసి ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. యువతులను బెదిరించి, వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి, బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇలా మోసపోయిన యువతి ఒకరు కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా వారి సెల్ పోనుల్లో వీడియోలు బయటపడ్డాయి. వీటిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ప్రేమ పేరుతో కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులపై వల వేశామని, వలలో పడినవారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశామని నిందితులు వివరించారు. అంతేకాకుండా వారిని భయపెట్టి, బెదిరించి డబ్బు వసూలు చేశామని, న్యూడ్ వీడియోలు చిత్రీకరించామని తెలపడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

నిందితుల వద్ద 100 మంది విద్యార్థినుల వీడియోలు లభించగా.. వీరి సంఖ్య 200 మంది వరకు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అత్యాచారాలకు గురైనవారెవరూ బెదిరింపులకు భయపడి పోలీసులకు భయపడి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. గత రెండేళ్లలో ఈ ముఠా దారుణాలకు తెగబడిందని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులకు పట్టుబడిన నిందితులు మాత్రం ఈ అత్యాచారాల్లో ఒక రాజకీయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారని చెప్పడంతో తమిళనాట కలకలం రేగుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad