నారా లోకేశ్ పై షాకింగ్ విషయాలు వెల్లడించిన వైఎస్సార్సీపీ ఎంపీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 22, 2019

నారా లోకేశ్ పై షాకింగ్ విషయాలు వెల్లడించిన వైఎస్సార్సీపీ ఎంపీ

ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి గురించి వెల్లడిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తాజాగా రాష్ట్రంలో అధికారుల మీద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పాత్ర ఉందని బాంబు పేల్చారు.

రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులపైన అవినీతి నిరోధక శాఖ దాడులు చేయడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఏసీబీతో దాడులు చేయించి ఆయా అధికారులను ఆ పదవుల నుంచి తప్పించి కమ్మ కులస్తులను ఆ పోస్టుల్లో పెట్టడానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొంటున్నారు. లోకేశ్ ఇచ్చిన జాబితాలో ఎవరైతే అధికారులు ఉంటారో వారిపైనే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. బీసీలు, ఎస్టీ, ఎస్సీ అధికారులందరూ అవినీతిపరులేనని ముద్రవేసేందుకు ఈ దారుణానికి తెగించారని ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి విజయసాయిరెడ్డి చెప్పినదాంట్లో వాస్తవం లేకపోలేదు. విశాఖ భూకుంభకోణం సమయంలోనూ గంటా శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టడానికి ప్రత్యేకంగా కాపు అధికారులపైన ఏసీబీ దాడులు చేయించారు. తప్పు చేసినవారిపై దాడులు చేయించడం, వారిని సస్పెండ్ చేయించడంలో తప్పు లేకపోయినా రాష్ట్రాన్ని ఒడిసిపట్టి కీలక స్థానాల్లో పాగా వేసిన చంద్రబాబు సామాజికవర్గం అధికారులపై మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా దాడులు జరగకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి వరకు కీలక స్థానాల్లో ఉంది చంద్రబాబు సామాజికవర్గమే. అలాంటిది వారిపై ఇన్నేళ్లలో ఒక్కదాడి జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండదండలు అందించడం వల్లే వారిపై దాడులు జరగడం లేదని ఇటీవల టీడీపీలో నుంచి వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.


No comments:

Post a Comment

Post Bottom Ad