వైఎస్ జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 23, 2019

వైఎస్ జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహా చెడ్డవాడంటున్నారు.. మెగా బ్రదర్ నాగబాబు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోమారు తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ 'సాక్షి' పత్రికలో వచ్చిన కథనంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మై చానల్ - నా ఇష్టం' పేరుతో ఇటీవల కాలంలో యూట్యూబ్ చానల్ ను ఒకదాన్ని నాగబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ యూట్యూబ్ చానల్ లో ప్రస్తుత రాజకీయాలు (ప్రధానంగా ఏపీ రాజకీయాలు), చంద్రబాబు, వైఎస్ జగన్ లపై పేరడీ స్కిట్ లు చేస్తూ పవన్ అభిమానులను ఆయన అలరిస్తున్నారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా జగన్ పత్రిక సాక్షిపై ధ్వజమెత్తారు. చానల్, పేపర్ చేతిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో తప్ప ఎవరితోనూ పొత్తుల్లేవని పవన్ వీడియో రూపంలో చెప్పినా వీళ్ల కళ్లకు కనిపించడం లేదని మండిపడ్డారు.

జర్మనీలో నియంత అడాల్ఫ్ హిట్లర్ కాలంలో గోబెల్స్ అని ఒక మంత్రి ఉండేవాడని ఇలాగే అసత్యాలను ప్రచారం చేయించేవాడని గుర్తు చేశారు. ఒక అసత్యాన్ని, అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయించి నిజమని నమ్మించేవాళ్లని, జగన్ మీడియా చేస్తుంది కూడా ఇదేనని తన యూట్యూబ్ చానల్  లో వివరించాడు. గత ఎన్నికల్లో ఓట్లు చీల్చకూడదని, విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన సీఎం కావాలనే ఉద్దేశంతో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. ఆనాడు ఉన్న ఇద్దరు సీఎం అభ్యర్థుల్లో జగన్ మహా చెడ్డవాడని, చంద్రబాబు చెడ్డవాడని ఈ నేపథ్యంలో కొంచెం ఫరవాలేదని చంద్రబాబును పవన్ ఎంచుకున్నాడని స్పష్టం చేశాడు. ఈ వీడియోపై వైఎస్ జగన్ అభిమానులు నాగబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad