వైఎస్ జగన్ పై వంగవీటి రాధా తాజా షాకింగ్ కామెంట్స్ ఇవే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, February 24, 2019

వైఎస్ జగన్ పై వంగవీటి రాధా తాజా షాకింగ్ కామెంట్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా. ఇటీవల ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక టీవీ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, ఆ పార్టీ గెలవకుండా ఉండటానికి ఎంత చేయాలో అంతా చేస్తానని బాంబు పేల్చారు. అవసరమైతే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటిస్తానని తేల్చిచెప్పారు. తనను పార్టీలో అడుగడుగునా అనేక అవమానాలకు గురిచేశారని, పార్టీ నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటారని, పైగా తానే రాజీనామా చేశానని చెబుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ లాంటి నియంత రాష్ట్రానికి అవసరం లేదని, అందరూ వచ్చే వేసవిలో 'ఫ్యాన్లు' ఆపి ఏసీ వేసుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలతో సంచలనం రేపారు.

తన రాజకీయ భవిష్యత్ గురించి తనకు చింత లేదని, వచ్చే కాలమే దానికి సమాధానం చెబుతుందని రాధా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరుతున్నానని ఎక్కడా చెప్పలేదని, ఎవరికి నచ్చినట్టు వారు రాసుకుంటున్నారని మండిపడ్డారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరడంపై స్పందిస్తూ.. ఇప్పుడే వారు పార్టీలో చేరారని, ముందుముందు జగన్ నిజ స్వరూపం ఏమిటో వారికి తెలిసివస్తుందని అన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు తాను ముందు అడగలేదని, విజయవాడ తూర్పులో పనిచేసుకుంటున్న తనను జగన్ సెంట్రల్ కు వెళ్లి పనిచేసుకోవాలని సూచించడంతో అక్కడకు వెళ్లాలని తేల్చిచెప్పారు. మూడున్నరేళ్లు ఆ నియోజకవర్గంలో పనిచేశాక ఇప్పుడు ఎవరో వచ్చారని తనను బయటకు పొమ్మనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad