పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనతో టీడీపీ వణికిపోతోందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 26, 2019

పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనతో టీడీపీ వణికిపోతోందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ముంగిట తన జోరు పెంచారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటనలు ముగించుకున్న ఆయన ప్రస్తుతం రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలులో నిర్వహించిన సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆదరాభిమానాలతో పవన్ తడిసిముద్దయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయపడింది.

గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ అత్యధికంగా 11 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఆ తర్వాత ఐదుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకుంది. అంతేకాకుండా వారిలో ఒకరికి అంటే భూమా అఖిలప్రియకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గెలిచిన ఇద్దరు వైఎస్సార్సీపీలను పార్టీలో చేర్చుకుంది. ఇలా అక్రమ పద్ధతిలో కొనుగోలు చేసిన పార్టీ నేతలతో వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసింది.

అయితే.. నేతలు పార్టీ మారినా క్యాడర్ అంతా వైఎస్సార్సీపీలోనే ఉంది. దీంతో గత ఎన్నికల్లో మాదిరిగా దెబ్బతినకుండా కనీస మొత్తంలోనైనా సీట్లు దక్కించుకోవడానికి టీడీపీ వ్యూహం పన్నింది. అయితే ఇంతలో పవన్ కల్యాణ్ వచ్చి టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లేయడంతోపాటు కొన్ని సీట్లను గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో విజయం సాధించడం గమనార్హం. పవన్ సామాజికవర్గంతోపాటు వివిధ సామాజికవర్గాల్లో పవన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో మరోమారు కర్నూలు జిల్లాలో బోణీ కొట్టాలనేది పవన్ ఆలోచన. దీంతో టీడీపీ కిందామీద అవుతోంది. పవన్ పర్యటనతో తమ కలలన్నీ కల్లలేనని వాపోతోంది. మరోమారు కర్నూలు జిల్లాలో దారుణ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని కలత చెందుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad