లోక్ సభ ఎన్నికల్లో పవన్ అభిమానుల చేతిలో టీఆర్ఎస్ కు షాక్ తప్పదా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

లోక్ సభ ఎన్నికల్లో పవన్ అభిమానుల చేతిలో టీఆర్ఎస్ కు షాక్ తప్పదా?

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పవన్ కల్యాణ్ అభిమానులు షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయని సంగతి తెలిసిందే. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు టీఆర్ఎస్ కు ఓటేశారు. ఇదంతా పవన్ కల్యాణ్ పరోక్ష పిలుపు మేరకే జరిగింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకివ్వడానికి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నిశ్చయించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అదేమిటంటే.. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం ఓడిపోతుందని, వైఎస్ జగన్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చెప్పడంపై పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి తమ సహాయం తీసుకుని వైఎస్ జగన్ కు మద్దతివ్వడంపై వారంతా రగిలిపోతున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న టీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్నారు.

వాస్తవానికి టీఆర్ఎస్ గెలుపుపై పెద్దగా సందేహాలు ఎవరికీ లేనప్పటికీ అంతటి ఘన విజయం సాధించడం వెనుక మెగాభిమానులు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు కీలక పాత్ర పోషించారు. అందులోనూ కాపు సామాజికవర్గం తెలంగాణలో అత్యంత బలంగా ఉంది. బీసీలుగా పిలవబడుతున్న మున్నూరు కాపులు తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా పవన్ పరోక్ష పిలుపు మేరకు టీఆర్ఎస్ కే ఓటేశారు. ఉదాహరణకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గంలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ. ఇక్కడ టీడీపీ గెలుస్తుందనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కుటుంబం నుంచి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని బరిలో దించారు. అయితే ఆమె భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ. ఏకంగా 65 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మరీ సుహాసినిని ఓడించారు.

టీఆర్ఎస్ గెలుపుకు తాము ఇంతలా ఉపయోగపడితే కేటీఆర్.. పవన్ కల్యాణ్ ప్రస్తావన లేకుండా వైఎస్ జగన్ ఘనవిజయం సాధిస్తారని వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని పవన్ అభిమానులు అంటున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad