ప్రత్యేక హోదా కోసం ఎవరు ఏం చేశారో చూడండి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, February 14, 2019

ప్రత్యేక హోదా కోసం ఎవరు ఏం చేశారో చూడండి!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రత్యేక హోదా డిమాండును నిర్వీర్యం చేసి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీ పార్టీ గొంతు నొక్కి, నాలుగేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని అనుభవించి, ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో నల్ల చొక్కా ధరించి ఎన్నికల వేషం కట్టి, ప్రత్యేక హోదా రాగం పాడితే ప్రజలు ఎలా నమ్ముతారని టీడీపీని, చంద్రబాబును దుమ్మెత్తి పోసే వీడియోలు, మెసేజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బాబు మాటలను, ప్రస్తుత వీడియోలను పక్కపక్కనే చూసిన సామాన్య ఓటరు సైతం ముక్కున వేలేసుకుంటున్నాడు. ఓ వ్యక్తి ఇంతగా మాటలెలా మారుస్తాడంటూ ఆశ్చర్యపోతున్నాడు. బాబు తాను ఏంచేసినా, ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదనే పిల్లి సూత్రాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడా? అంటూ జాలి చూపుతున్నాడు. అయితే స్మార్ట్ ఫోన్, ఫోర్జీ ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రజలు ప్రత్యక్షంగా నిజాలు చూస్తున్నారు. గత ఐదేళ్లుగా నిజంగా, నిస్వార్థంగా ప్రత్యేక హోదా గురించి పోరాడిందెవరో ప్రతిఒక్కరి చేతిలోని ఫోన్లోనే కనపడుతుంటే చంద్రబాబు డ్రామాలు ఎలా సాగుతాయంటూ బాబుపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా తెలియవంటే అది నిజంగా అద్భుతమే. హోదా సంజీవని కాదని, హోదా అడిగితే జైల్లో పెడతానని, హోదా కంటే ప్యాకేజీయే మేలని ఇలా ఎన్నో నరం లేని నాలుకతో ఎన్నో మాటలు పలికిన బాబు... రాష్ట్రంలో కేంద్రంలో అధికార పార్టీలను ఎదురించి హోదా కోసం జగన్ చేసిన దీక్షలు, పోరాటాలను ఒక్కసారి తెలుసుకుని తన కొత్త డ్రామాలకు స్వస్తి చెప్పాలని హితవు చెబుతున్నారు.


 • మార్చ్ 2015లో ఎంపీలతో  దిల్లీ వెళ్ళి మోదీని కలిసి ప్రత్యేక హొదా అడిగిన జగన్.
 • మే 2015లో ప్రత్యేక హొదా కోరుతూ పార్లమెంట్ సమావేశాల సంధర్భంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ దగ్గర ధర్నా. 
 • 3,4 జూన్ 2015 - ప్రత్యేక హోదా కోరుతూ మంగళగిరిలో  జగన్ రెండు రోజుల సమర ధీక్ష.
 • 9 జూన్ 2015న దిల్లీలో రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదా అడిగిన జగన్. 
 • 10 ఆగస్టు 2015న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ దిల్లీలో ధర్నా
 • 15 ఆగస్ట్ 2015న జగన్ రాసిన లేఖకి సమాధానం ఇస్తూ ప్రత్యేక హోదా లేదు అని కేంద్రం జవాబు లేఖ పంపింది.
 • 29 ఆగస్ట్ 2015న ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
 • 15 సెప్టెంబర్ 2015 - న ప్రత్యేక హోదా కోరుతూజగన్ తిరుపతిలో యువ భేరి. 
 • 22 సెప్టెంబర్ 2015న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ విశాఖలో యువ భేరి. 
 • 7 అక్టొబర్ 2015న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ నల్లపాడులో  6 రోజుల నిరాహార దీక్ష.
 • 27 జనవరి 2016న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ కాకినాడలో యువ భేరి. 
 • 2 ఫిబ్రవరి 2016న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ శ్రీకాకుళంలో యువ భేరి. 

 • 24 ఫిబ్రవరి 2016న ప్రత్యేక హోదా ఇవ్వాలి అని రాష్ట్రపతికి జగన్ వినతి.
 • 2016 మే 10న ప్రత్యేక హోదా కోరుతూ కాకినాడ కలెక్టరేట్ దగ్గర జగన్ ధర్నా
 • 2016 ఆగస్టు 2న ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చిన జగన్
 • 2016 ఆగస్టు 4న ప్రత్యేక హోదా కోసం నెల్లూరులో యువభేరి నిర్వహించిన జగన్ 
 • 2016 ఆగస్టు 8న ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన జగన్ .
 • 2016 ఆగస్టు 10న ప్రత్యేక హోదా కోసం రుషికేష్లొ హోమం నిర్వహించిన జగన్
 • 2016 సెప్టెంబర్ 10న ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చిన జగన్
 • 22 సెప్టెంబర్ 2016న ప్రత్యేక హోదా కొరుతూ జగన్ ఏలూరులో యువ భేరి.
 • 25 సెప్టెంబర్ 2016 ప్రత్యేక హోదా మీద ప్రవాసాంద్రులతో జగన్ ముఖా ముఖి
 • 25 అక్టొబర్ 2016న ప్రత్యేక హోదా కోరుతూ జగన్ కర్నూల్లో యువ భేరి.
 • 6 నవంబర్ 2016న ప్రత్యేక హోదా కొరుతూ జగన్ విశాఖలో "జై ఆంద్రప్రదేశ్" బహిరంగ సభ
 • 19 డిసెంబర్ 2016న ప్రత్యేక హోదా కొరుతూ విజయనగరంలో జగన్ యువభేరి.
 • 26 జనవరి 2017న ప్రత్యేక హోదా కోరుతూ వైజాగ్లో క్యాండీల్ ర్యాలీ..
 • 16 ఫిబ్రవరి 2017న ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో జగన్ యువభేరి.
 • 10 అక్టోబర్ 2017న ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురం జిల్లాలో యువభేరి.

No comments:

Post a Comment

Post Bottom Ad