ఈ సర్వేలోనూ వైఎస్ జగనే సీఎం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 22, 2019

ఈ సర్వేలోనూ వైఎస్ జగనే సీఎం

వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎం అవుతారని దాదాపు అన్ని సర్వేలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే వైఎస్ జగన్ కే పట్టం కట్టింది. ప్రముఖ జాతీయ మీడియా అయిన ఇండియా టుడే తాజాగా ప్రకటించిన సర్వే ఫలితాల్లో జగన్ సీఎం కావాలని ఏకంగా 45 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు కేవలం 36 శాతమే. చంద్రబాబు కంటే తొమ్మిది శాతం ఎక్కువగా జగన్ సీఎం కావాలని ప్రజలు భావిస్తున్నట్టు ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇదే క్రమంలో్ ముఖ్యమంత్రి పదవికి మరో బలమైన అభ్యర్థిగా భావిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలని కేవలం నాలుగు శాతం మందే కోరుకుంటున్నారని సర్వే పేర్కొంది.

గత సెప్టెంబర్ లో ఇండియా టుడే వెల్లడించిన సర్వేలోనూ వైఎస్ జగన్ ను సీఎంగా కోరుకుంటున్నవారి శాతం 43గా తేలింది. చంద్రబాబును 38 శాతం మంది మళ్లీ కావాలని కోరుకున్నారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని గత సెప్టెంబర్ లో కోరుకున్నవారి శాతం 5. అయితే ఇప్పుడు మరోమారు ఇండియా టుడే తాజాగా వెల్లడించిన సర్వేలో చంద్రబాబు సీఎంగా మరోమారు ఉండాలని కోరుకుంటున్నవారు రెండు శాతం తగ్గారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నవారిలో ఒక శాతం తగ్గారు. కానీ వైఎస్ జగన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నవారు రెండు శాతం పెరగడం గమనార్హం.

నాలుగున్నరేళ్లకు పైగా ప్రజలను పట్టించుకోకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు అనేక ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నప్పటికీ వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని తాజా సర్వే ప్రకారం తేలిపోయింది. అంతేకాకుండా అధికార పార్టీ నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్సీపీలో చేరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం తప్పదని తేటతెల్లమవుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad