నూజివీడు నుంచి పోటీ చేస్తున్న ఆ హీరో కోడలు ఎవరంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 25, 2019

నూజివీడు నుంచి పోటీ చేస్తున్న ఆ హీరో కోడలు ఎవరంటే..

ప్రస్తుతం టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టనున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను నిలపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణా జిల్లా నూజివీడు లేదా గుడివాడ నుంచి ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపను పోటీలోకి దింపుతారనే వార్తలు వస్తున్నాయి. మురళీమోహన్ కు వయసు మీద పడటంతో మామ తరఫున రాజమండ్రి నియోజకవర్గంలో అన్ని పనులను మాగంటి రూపే పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మురళీమోహన్ స్థానంలో రాజమండ్రి ఎంపీగా రూపే పోటీ చేస్తారని ఇటీవల కాలం వరకు వార్తలు కూడా వచ్చాయి.

అయితే.. నూజివీడు, గుడివాడలో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కొడాలి నాని ఉన్నారు. గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత లేదు. నూజివీడులో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్థానికుడు కాదు. ఆయన రోజూ విజయవాడ నుంచి నూజివీడుకు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆయనపై సంతృప్తిగా లేరు. దీంతో మాగంటి రూపను నూజివీడు నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. గుడివాడలో కొడాలి నాని లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి రూప అవసరమని టీడీపీ మరో ఆలోచన చేస్తోంది. మరికొద్ది రో్జుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad