ఆ మహిళా ఎమ్మెల్యేని వైఎస్సార్ ఆదరించారు.. వైఎస్ జగన్ పొమ్మంటున్నారు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 23, 2019

ఆ మహిళా ఎమ్మెల్యేని వైఎస్సార్ ఆదరించారు.. వైఎస్ జగన్ పొమ్మంటున్నారు!

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ హుళక్కేనని తెలుస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన ఈమెకు ఈసారి పార్టీ అధినేత జగన్ టికెట్ నిరాకరించినట్టు సమాచారం. వాస్తవానికి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక పార్టీ మారి టీడీపీలో చేరినా గౌరు చరిత మాత్రం వైఎస్ జగన్ తోనే ఉన్నారు.

అయితే.. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. కాటసాని.. పాణ్యం నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అరవై వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచారు. కాటసాని దెబ్బకు టీడీపీ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంతటి సమర్థుడైన కాటసానిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నిలపాలనేది పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది.

మరోవైపు కాటసాని పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపిస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు తమకు దక్కే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాటసానికి టికెట్ ఇస్తే టీడీపీలో చేరడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అనుచరులకు, మీడియాకు ఇప్పటికే లీకులిచ్చారు.

వాస్తవానికి గౌరు చరిత కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకుంది.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి. చరిత భర్త గౌరు వెంకటరెడ్డికి జంట హత్యల కేసులో పదేళ్ల జైలు శిక్ష పడితే వైఎస్ దాని నుంచి గౌరును బయటపడేశారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు చెలరేగినా ఆయన లక్ష్యపెట్టలేదు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా చరితను గెలిపించారు. గౌరు చరితపై 'యాత్ర' సినిమాలోనూ సన్నివేశం ఉండటం గమనార్హం. గౌరు చరితగా ప్రముఖ యాంకర్ అనసూయ నటించింది. వైఎస్సార్ తమను ఇంతలా ఆదుకుంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్ తమను నిరాదరించడం పట్ల చరితలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad