సీఎం చంద్రబాబు హుందాతనాన్ని పోగొట్టుకున్నారా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 22, 2019

సీఎం చంద్రబాబు హుందాతనాన్ని పోగొట్టుకున్నారా?

వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలతో తన హుందాతనాన్ని పోగొట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలిసే జరిగిందని వ్యాఖ్యానించి అందరిలోనూ పలుచనయ్యారు. కొద్ది రోజుల కిందట పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు కేంద్రంపై రాజకీయ విమర్శలు చేసి తాను కూడా దిగువ శ్రేణి రాజకీయ నాయకుడేనని చాటుకుంటున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన దారుణమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో మమతా బెనర్జీతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సీఎం చంద్రబాబు ఆమె బాటలోనే ప్రధాని మోదీని తూర్పూరబడుతున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా తమ దేశానికి ఉగ్రదాడితో సంబంధం లేదని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి పాకిస్థాన్ ప్రధానమంత్రి మాటలనే తాను విశ్వసిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. దీనిపై అందరిలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. దేశానికి సంబంధించి విషయాల్లో అందరూ ఒకతాటిపై ఉండాల్సింది పోయి ఇందులోనూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు వెతుక్కోవడాన్ని అందరూ ఖండిస్తున్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లాభపడాలనే ఉద్దేశంతోనే మోడీ ఉగ్రదాడి జరిపించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తద్వారా గతంలో మాదిరిగా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ఎన్నికల ముందు భారతీయుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లాభపడాలనేదే మోడీ ప్లాన్ అని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీ, ప్రధాని మోదీ చెప్పే మాటలకంటే చంద్రబాబు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలనే విశ్వసిస్తున్నారని, దీన్ని బట్టే చంద్రబాబు ఎలాంటి రాజకీయ నాయకుడే తెలుస్తోందని మండిపడుతున్నారు. 



No comments:

Post a Comment

Post Bottom Ad