లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నుంచి మరిన్ని ఫొటోలు విడుదల చేసిన వర్మ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, January 23, 2019

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నుంచి మరిన్ని ఫొటోలు విడుదల చేసిన వర్మ!


లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా మొదట్నుంచి వివాదాల్లోనే ఉంటోంది. నందమూరి తారక రామారావు జీవితం చివరి దశలో జరిగిన వాస్తవ ఘట్టాలనే సినిమా తీస్తున్నట్టుగా రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా వెన్నుపోటు పాటను విడుదల చేసి చంద్రబాబు ఫొటోలు చూపడంపై తెలుగుదేశం నేతలు పలు విమర్శలు సైతం చేశారు. అయినప్పటికీ వర్మ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే రెండు పాటలు రెండు స్టిల్స్ విడుదల చేసిన వర్మ తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆన్‌లోకేషన్‌ స్టిల్స్‌ను రిలీజ్‌ చేశాడు. ఎన్టీఆర్‌ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను రిలీజ్ చేశాడు. ఈ నెలాఖరున లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.





No comments:

Post a Comment

Post Bottom Ad