అందుకే చిరంజీవిని వదిలేశా..: పవన్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 03, 2018

అందుకే చిరంజీవిని వదిలేశా..: పవన్‌

Pawan-Kalyan-Speech-At-Anantapur
తనకు కుటుంబ వ్యామోహం లేదని, అందుకే అన్న చిరంజీవిని కూడా వదిలేశానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. అనంతపురం బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రూ.1000 కోట్ల నుంచి రూ.3500 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పంచాయతీకి పోటీ చేయలేని నారా లోకేష్‌ పంచాయతీ రాజ్‌శాఖకు మంత్రికావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదన్నారు. మోదీ అంటే తనకేం భయం లేదని, దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని పవన్‌ సవాల్‌ విసిరారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment

Post Bottom Ad