మళ్లీ అధికారం నిలబెట్టుకుంటాం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, December 07, 2018

మళ్లీ అధికారం నిలబెట్టుకుంటాం

KCR Cast His Vote At Chinthanamadaka
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రభంజనం సృష్టిస్తామన్నారు. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. పట్టణ ఓటర్లు, వృద్ధులు ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు వస్తున్నారని అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad