ఉత్తమ్ టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడ్డారా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 15, 2018

ఉత్తమ్ టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడ్డారా?


తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, దాని సారథ్యంలోని కూటమి ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో మెల్లమెల్లగా అసంతృప్తి సెగలు బయటకు వస్తున్నాయి. నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వ నాశనం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. హౌజింగ్‌ మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలను బయటపెట్టకుండా ఉండడానికి టీఆర్‌ఎస్‌ పార్టీతో లాలూచీ పడ్డాడని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని నమ్మినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్మలేకపోయారని గజ్జెల కాంతం విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య సారథ్యంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని దుయ్యబట్టారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారని ఆరోపించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad