విమర్శకులకు క్లాస్ పీకిన రవిశాస్త్రి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

విమర్శకులకు క్లాస్ పీకిన రవిశాస్త్రి!


స్వదేశంలో దుమ్మురేపుతున్న భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ముఖ్యంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లలో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా, కోచ్ రవిశాస్త్రి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో గెలుపు గురించి మీడియా వేసిన ప్రశ్నలకు రవిశాస్త్రి ఘాటుగానే స్పందించాడు. సొంత దేశంలో ఏ టీం అయినా బలంగా ఉంటుందని, చాలా దేశాల జట్లు విదేశాల్లో రాణించడం లేదని చెప్పాడు. కేవలం టీమిండియానే భారత్‌నే వేలెత్తి చూపడమెందుకంటూ క్లాస్ పీకాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad