కోహ్లీ ప్రవర్తనపై హర్షా భోగ్లే కామెంట్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 08, 2018

కోహ్లీ ప్రవర్తనపై హర్షా భోగ్లే కామెంట్లు!


భారత క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ అభిమాని విమర్శలకు బదులుగా చేసిన కామెంట్‌ పెద్ద దుమారాన్నే లేపుతోంది. కోహ్లీ బ్యాటింగ్‌లో ప్రత్యేకత కనిపించదని, అతని కంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లే బెటరంటూ ఆ అభిమాని చేసిన కామెంట్లకు బదులుగా కోహ్లి.. అలాంటప్పుడు ‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు.. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో’ అంటూ ఘాటుగా స్పందించాడు. దాంతో నెటిజన్లు అందరూ కోహ్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.  తాజాగా ఈ ఘటనపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా కోహ్లి స్పందించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డాడు. తమకు నచ్చిన విషయాలే వినాలనుకునే ఈ రకమైన బుడగను ఏర్పరచుకోవడం మంచిది కాదంటూ భోగ్లే ట్విటర్‌లో హితవు పలికాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad