ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్ దారుణ హత్య! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 03, 2018

ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్ దారుణ హత్య!


ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్ మౌలానా సామ్యూల్ హక్ (82)ను పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని సొంత ఇంట్లోనే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మౌలానా అంగరక్షకుడు బయటికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ దారుణం జరిగిందని మౌలానా కుమారుడు హమిదుల్ హక్ తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు దైవదూషణ కేసులో క్రిస్టియన్‌ మహిళకు మరణశిక్షను రద్దు చేయడానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే  హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

No comments:

Post a Comment

Post Bottom Ad